best telugu movies on amazon prime

Amazon prime లో రోజు చాలా సినిమాలు విడుదల అవుతాయి. ఇందులో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లాంటి అన్ని రకాల సినిమాలు ఉంటాయి, అంతే కాక ఇందులో అన్ని బాషల సినిమాలు కూడా ఉంటాయి. మేము మీకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమాలను ఎంపిక చేసి ఈ ఆర్టికల్ లో మీకు అందించాం.

Also read: best telugu movies

కేవలం కొత్త సినిమాలే కాకుండా, కొన్ని పాత సినిమాలు కూడా ఈ ఆర్టికల్ లో మీకోసం తీసుకువచ్చాం. మేము మా వెబ్సైటు లో తరచుగా కంటెంట్ ని అప్డేట్ చేస్తాము. అందుకే మా వెబ్సైటు ను తరచుగా follow అవ్వండి.

best telugu movies on amazon prime

New telugu movies on amazon prime

1. Vakeel Saab telugu movie వకీల్ సాబ్

వకీల్ సాబ్ మూవీ బాలీవుడ్ మూవీ అయినా పింక్ సినిమా ను మళ్ళి తెలుగులో తీశారు. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్, నివేత థామస్ నటించారు. ముగ్గురు అమ్మాయిల మీద వచ్చిన attempt to murder కేస్ గురించి ఉంటుంది. ఆ కేస్ పవన్ కళ్యాణ్ takeup చేస్తాడు. ఆ కేసును పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు తీసుకువెళ్తాడు అనేది సినిమా.

Actors: Pawan Kalyan, Nivetha Thomas
Director: Venu Sriram
producers: Dil Raju, Sireesh

2. Jaathi rathnalu telugu movie జాతి రత్నాలు

జాతి రత్నాలు మూవీ కూడా ఈ మధ్యే విడుడల అయ్యింది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి మరియు ఫారియా అబ్దుల్లా నటించారు. వీళ్ళందరూ కూడా చాలా బాగా నటించారు మరియు జనాల దగ్గరి నుండి చాలా ప్రశంసలు పొందారు. జాతిరత్నాలు సినిమాని చాలా మంది తెలుగు హీరోస్ కూడా మెచ్చుకున్నారు.

Actors: Naveen polishtty, Faria abdullah, Rahul ramakrishna, Priyadarshi
Director: Anudeep KV
Producers: Nag Ashwin

3. akasam nee haddura ఆకాశం నీ హద్దు రా

చాలా కాలం తరువాత సూర్య ఈ సినిమాతోనే చొcomeback ఇచ్చాడు. దీనికి ముందు సినిమాలు చాలా మూవీస్ హిట్ కాలేదు. akasam nee haddura సినిమాGopinath యొక్క లైఫ్ బయోగ్రాఫికల్ సినిమా. ఈ సినిమా సూర్య acting వల్లే ఇంత పెద్ద హిట్ అయ్యింది. ఇందులో ఉన్న Aparna Balamurali హీరోయిన్ కూడా చాలా బాగా నటించింది.

ఒక సాధారణమైన వ్యక్తి తన కలలను ఎలా సాకారం చేసుకున్నాడు అనే లైన్ పైన్ సినిమా మొత్తం ఉంటుంది. అతని కల కూడా పెద్దది కాబట్టే సినిమా కూడా అంత పెద్ద హిట్ అయ్యింది.

Actors: Suriya, Aparna balamurali
Director: Sudha Prasad
Producers: Suriya, Guneet M

4. Master

ఇళయదళపతి విజయ్ యొక్క సినిమా ఇది. Lokesh Kanagaraj గారి దర్శకత్వం లో మాస్టర్ సినిమా తెరకెక్కింది. విజయ్ ఈ సినిమాలో ఒక కాలేజీ ప్రొఫసర్ మరియు ఒక తాగుబోతు. తాను ఒక జైలు లో ఖైదీలకు పాటలు చెప్పడానికి వెళ్తాడు. అక్కడే చిన్నపిల్లలతో నేరాలు చేపిస్తున్న ఒక గ్యాంగస్టర్ గురించి తెలుసుకొని అతని నుంచి వాళ్ళని రక్షిస్తాడు.

Actors: Vijay, Vijay sethupathi, Malavika Mohan
Director: Lokesh Kanagaraj
Producers: Xavier Britto

5. middle class meloadies మిడిల్ క్లాస్ మెలోడీస్

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా 2020 సమ్వత్సరం రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యిన కొత్తలో ఈ సినిమాను అందరు మెచ్చుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు.

ఈ సినిమాలో మధ్యతరగతి అనుభూతుల్ని చాలా బాగా చూపించారు. ఒక మధ్యతరగతి కుటుంబం పడే కష్టాలు మరియు వాళ్ళ పిల్లలు వాళ్ళ కలల్ని నెరవేర్చువడం తో ఎంత కష్టం ఉంటుంది అని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ కొండాల్రావు, ఈ సినిమా హిట్ కావడానికి ముఖ్య కారణం కూడా అతనే.

అతను ఒక మిడిల్ క్లాస్ తండ్రి ఎలా ఉంటాడో కళ్ళకి కట్టినట్టుగా చూపించాడు. మొత్తానికి ఈ సినిమా డైరెక్టర్ Vinod Anantoju మిడిల్ క్లాస్ మెలోడీస్ ని మనకి చూపించడానికి సక్సెస్ సయ్యాడనే చెప్పొచ్చు. ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ అబ్బాయినే కదా!

Actors: Anand devarakonda, Varsha bollamma
Director: Vinod Anantoju
Producer: Venigalla Anand Prasad

6. brochevarevarura బ్రోచేవారెవరు రా

ముగ్గురు ఫెయిల్ అయినా స్టూడెంట్స్ కథే ఈ బ్రోచేవారెవరు రా. వాళ్ళ ఫ్రెండ్ మిత్ర కి ఉన్న ప్రాబ్లెమ్ సాల్వ్ చేసే ప్రయత్నం లో ఎదురయ్యే సమస్యలు మరియు వాళ్ళ లైఫ్ చూపిస్తారు ఈ సినిమాలో. ఈ మూవీ లో శ్రీ విష్ణు, నివేత థామస్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించారు. సినిమాలో స్టోరీ పెద్దగా ఏమి లేకపోయింగ్ సినిమా ఆలా సాగిపోతూనే ఉంటుంది. మనకి బోర్ కొట్టకుండా ఉంటుంది.

Actor: Sree vishnu, Rahul Ramakrishna, Priyadarshi, Nivetha Thomas
Director: Vivek Athreya
Producer: Vijay kumar M

7. appatlo okadundevadu అప్పట్లో ఒకడుండేవాడు

అప్పట్లో ఒకడుండేవాడు ఈ మూవీ ఒక underrated movie. ఈ మూవీలో శ్రీ విష్ణు హీరోగా నటించాడు, అతని పేరు రైల్వే రాజు అతను క్రికెట్ బాగా ఆడతాడు కానీ ఒక చిన్న తప్పిదం వాళ్ళ పోలీస్ స్టేషన్ కి వెల్లావాసి వస్తుంది. అతను ఇండియన్ క్రికెట్ టీం కి ఆడాలి అనుకున్న కళలు అన్ని చెదిరిపోతాయి.

Actors: Sree vishnu,
Director: Sagar chandra
Producer: KrishnaVijay, Prashanti

5. TENET telugu movie

TENET ఒక హాలీవుడ్ సినిమా ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాను తరచుగా హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్లే చుడండి. ఎందుకంటే మీరు తెలుగు సినిమాలకి హాలీవుడ్ సినిమాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది.

Leave a Comment